ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం సముద్రతీరాన్ని బుధవారం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సముద్ర తీరానికి ప్రజలు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత పట్ల అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరియు ప్రజలకు ఎటువంటి ఆపద తనతకుండా గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులకు తెలిపారు.