రంపచోడవరం నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్న స్థానికులు
రంపచోడవరం నియోజవర్గంలో ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి 516 పై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ ప్రాంతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గంగవరం మండలం కునుకురాయలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదం ఈ ప్రాంతంలో వేగంగా తిరుగుతున్న వాహనాల తీరు కు నిదర్శనం అనీ స్థానికులు అంటున్నారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న ట్రాక్టర్ను ఒక కారు బలంగా ఢీకొనడంతో బలంగా ఉండే ట్రాక్టర్ మూడుముక్కలవ్వడం స్థానికులకు భయంగా కలుగుతుంది అధికారులు స్పందించి ఇటువంటి ప్రమాదాల జరగకుండా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు.