ఖమ్మం అర్బన్: ఖమ్మం రైల్వే స్టేషన్లో రైలు కింద పడిపోయి యువకుడు ఆత్మహత్య
గూడ్స్ రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం రైల్వే స్టేషన్ లోని టి టి ఈ ఆఫీసు ఎదురుగా సుమారు 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అమృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాస్ అతని బృందం సాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరికి తరలించినట్లు తెలిపారు.