విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిరసన యోగ కార్యక్రమం
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిరసన యోగ కార్యక్రమాన్ని సిఐటియు అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్వహించాయి శుక్రవారం ఉదయం 8 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్లో అక్రమంగా తొలగించిన 4,000 మంది కార్మికులను తక్షణమే వీధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లని వస్త్రాలు ధరించి నిరసన యోగాను నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ స్టీల్ ప్లాంట్ ను అమ్మడం లేదంటూ విశాఖ వేదికగా ప్రకటన చేయాలని వారు డిమాండ