నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మార్పీఎస్ అమరవీరుల విజయోత్సవ సభ ఈనెల 25న నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగ తెలిపారు, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు, సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్యను మార్కెట్ యార్డ్ లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు మురళి మాదిగ, ప్రధాన కార్యదర్శి రాజేష్ లో పాల్గొన్నారు.