పత్తికొండ: పత్తికొండలో న్యాయవాదులు రక్షణ కల్పించాలంటూ ధర్నా
తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యుడు రాజశేఖర్‌పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన దాడికి నిరసనగా బుధవారం పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల మంటపం వద్ద న్యాయవాదులు నిరసన ధర్నా చేపట్టారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని, అందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పత్తికొండ బార్ అసోసియేషన్ సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.