ఉప్పాడ లో మత్స్యకారులు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా నిరసన, జెసి రాహుల్ మీనా, మత్స్యకారులు తో మాట్లాడారు.
కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిరసన కార్యక్రమానికి దిగారు .రోడ్డుపై బైఠాయించి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పరిహారం కోరుతూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులు తో ఆర్డీఓ మల్లిబాబు , జేసీ రాహుల్ మీనా, ఏఎస్పి మనీషా దేవరాజ్ పాటిల్ లు చర్చలు జరిపారు. ఫార్మా కంపెనీల ద్వారా నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళన చేస్తున్న మత్స్యకారులు అధికారులకు తేల్చి చెప్పారు.