ఆలూరు: సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి డిఆర్ గవాయ్ పై జరిగిన దాడి హేయమైన చర్య: ఆలూరు న్యాయవాదులు
Alur, Kurnool | Oct 7, 2025 సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి డిఆర్ గవాయ్ పై జరిగిన దాడిహేయమయిందని, పలువురు న్యాయవాదులు ఖండించారు. దాడిని ఖండిస్తూ ఆలూరు న్యాయవాదులు మంగళవారం జూనియర్ సివిల్ కోర్టు ముందు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఐలు నియోజకవర్గం అధ్యక్షులు వీరేష్, కార్యదర్శి షాకీర్ మాట్లాడారు. భారత అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే సాధారణ ప్రజలకు ఏమి రక్షణ ఉంటుందని, ఈ దాడితో యావత్తు భారతం ఆందోళనకు గురైంది అన్నారు.