ఒంగోలు పట్టణంలో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 15, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సోమవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలో పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 10 ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమాల విధించినట్లు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి అంశాలను వాహనదారులకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని పోలీసులు వాహన దారులను పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.