రంపచోడవరం: పలకరాతిపాలెం గ్రామ సమీపంలో టైరు ట్యూబ్‌తో ప్రమాదకర స్థితిలో కాలువను దాటిన మహిళ, వంతెన నిర్మించాలని కోరుతున్న గిరిజనులు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర కాలువలు దాటడానికి గిరిజనులు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అడ్డతీగల మండలం పలకరాతిపాలెం గ్రామ సమీపంలో ఒక మహిళ తన బిడ్డతో టైరు ట్యూబ్ ను ఏర్పాటు చేసుకుని కాలువను దాటిన వీడియో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి సహాయంతో ఈ ట్యూబ్ సహాయంతో కాలువను దాటింది. అడ్డతీగల దేవిపట్నం మండలాల్లో ఇటువంటి సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయని. ఇటువంటి ప్రమాదకర కాలువలపై ఐటిడిఏ అధికారులు వంతెన నిర్మించాలని గిరిజనుల కోరారు.