సూర్యాపేట: విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి: పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న 10000 కోట్ల ప్లీజ్ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర ధర్నా నిర్వహించి సోమవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 యేండ్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుదని నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే బాటలో ప్రయాణిస్తుంది అన్నారు. వెంటనే విద్యార్థులకు ప్లీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.