దర్శి: మండలంలో రేషన్ కార్డుదారులకు ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ పలు సూచనలు
Darsi, Prakasam | Oct 17, 2025 ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని రేషన్ కార్డుదారులకు ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డుల స్థానంలో నూతనంగా స్మార్ట్ కార్డులను కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డు దారులు సంబంధిత డీలర్ల వద్ద స్మార్ట్ కార్డులను తీసుకోవాలని తెలిపారు. దీంతో డీలర్ల షాపుల వద్ద రేషన్ కార్డు దారులు రావడంతో సందడి వాతావరణం నెలకొన్నది. సర్వర్ ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోవడానికి స్మార్ట్ కార్డు ద్వారా సులభం అవుతుందని అన్నారు.