ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలను ప్రతి టీడీపీ నాయకుడు తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. కోవూరులో ఆమె మాట్లాడుతూ. నియోజవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. కార్యకర్తలే తన బలం, తన బలహీనత అని, ఏ సమస్య వచ్చినా కచ్చితంగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.