బేతంచర్ల లో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
Dhone, Nandyal | Sep 23, 2025 దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని బేతంచర్లలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం వేంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు నరేశ్ శర్మ వేదమంత్రోత్సవంలో కార్యక్రమాలు చేశారు. ఆలయ ఈవో మద్దిలేటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.