తడిగడప లో ఇండియా కూటమి పార్టీల నిరసన
Machilipatnam South, Krishna | Sep 17, 2025
పెనమలూరు నియోజకవర్గం తాడిగడప సెంటర్ లో ఎన్డీఏ ఓట్ల చోరీకి నిరసనగా ఇండియా కూటమి పార్టీలు, ప్రజా సంఘాలు బుధవారం ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ నేతలు 'ఓటు చోర్ - గద్ది చోడ్' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ఈవీఎంలను హ్యాక్ చేసి కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నిరసన జరిగినట్లు తెలిపారు.