స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛందలో 5 లక్షల మంది పాల్గొంటున్నారు : కలెక్టర్ హిమాన్షు
స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా సుమారు 5 లక్షల మంది పాల్గొంటున్నట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు . శనివారం బీవినగర్ లోని పార్క్ లో స్వర్ణాంధ్ర -స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలల నుండి స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నెల్లూరులో నిర్వహిస్తున్నామన్నారు. ఈవారం ప్రత్యేకంగా గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు.