సత్తుపల్లి: గంగారంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా తాన్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా వాలీబాల్ పోటీలను నిర్వహించారు.తాన్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు. గ్రామంలోని దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీలలోని విజేతలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ బహుమతులు ప్రధానం చేశారు.కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,తాన్ల ఫౌండేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు..