శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లిని గ్రామంలో బడికి తాళం వేసిన గ్రామస్తులు
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెన గ్రామంలో పాఠశాలకు గ్రామస్తులు తాళం వేసారు. తమ గ్రామంలోని పాఠశాలను రేషనైజేషన్ లో భాగంగా ప్రభుత్వం తొలగించిందని దీనిపై సంబంధిత అధికారులతో పాటు కలెక్టర్ కు కూడా వినతిపత్రాలు అందజేసినా ఎటువంటి స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామం నుండి పాఠశాలను తొలగించడంతో మేము 14 కిలోమీటర్లు దూరంలో పాలవలసకు కానీ, 10కిలోమీటర్లు దూరంలోని పాలకొండ కు కానీ వెళ్లి చదువుకోవాలని వర్షాకాలంలో ఏరు పారితే ఊరు జల దిగ్బంధంలో ఉంటుందని అలాంటిది మేము ఎలా చదువుకోవాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.