భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Oct 21, 2025
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలు, వర్షాలు కురుస్తాయని సమాచారం వచ్చినందున జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఐదు మండలాల్లో ప్రజలనుమంగళవారం అప్రమత్తం చేశామన్నారు. మత్య్సకారులు వేట వెళ్లవద్దని ఆయన సూచించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించామన్నారు. అసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్ల