అల్లూరి ఏజెన్సీలో పాముకాటుకి గురైన యువకుడ్ని ఏడు కిలోమీటర్లు డోలిమోసి ఆసుపత్రికి తరలించిన బంధువులు..
అల్లూరి ఏజెన్సీలో గిరిజనులకు డోలిమోతల కష్టాలు తప్పడం లేదు రహదారి సౌకర్యం సరిగా లేని కారణంగా కిలోమీటర్ల మేర డోలు మోసుకుంటూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది జిమాడుగుల మండలం వంతల పంచాయితీ తలబరిసింగి గ్రామానికి చెందిన బుజ్జి బాబుకు బుధవారం రాత్రి పాము కాటు వేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు దీంతో బంధువులు గురువారం ఉదయం 6 గంటల సమయంలో తలబర్సింగి గ్రామం నుండి వంతాల వరకు 7 కిలోమీటర్ల దూరం డోలి మూసుకుంటూ ఆసుపత్రికి తరలించారు తమ గ్రామానికి సరైన రహదారి నిర్మించాలంటూ వారు కోరుతున్నారు.