నిర్మల్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో తెగిపోయిన పెద్ద చెరువును పరిశీలించిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Nirmal, Nirmal | Sep 17, 2025 సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. బుధవారం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. చెరువు దిగువన దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు కట్ట బలహీనంగా మారడంతో తెగిపోయి రైతుల పంటలకు నష్టం చేకూరిందని ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.