కోడుమూరు: గూడూరులో హిందూ సమ్మేళన సభ గోడపత్రికలు విడుదల
గూడూరు పట్టణంలో ఈ నెల 13న జరిగే హిందూ సమ్మేళన సభకు సంబంధించిన గోడపత్రికలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు ప్రముక్ డమాం సురేష్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ చైతన్యం విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణంలో పలుచోట్ల గోడ పత్రికలు అతికించారు.