గిద్దలూరు: గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా గుండ్లకమ్మ వాగు కు వచ్చి చేరుతున్న వరద నీరు
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొద్దిరోజులుగా కొలుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మ వాగు కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ వద్దా శనివారం వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా రంగస్వామి గుండానికి వస్తున్న వరదనీరుతో భక్తులకు హాని తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు పడ్డారు. ఎవరు కూడా యువకులు ఈతకు వెళ్ళవద్దని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు ఆదివారం విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.