అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో ఉన్న పుట్లూరు మండల కేంద్రంలోని చింతకుంట వద్ద ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆర్టీసీ బస్సులో బడిబస్సు కావడంతో పుట్లూరు మండల కేంద్రానికి చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు అందులో ప్రయాణిస్తున్నారు. బస్సు స్టీరింగ్ స్టక్ కావడంతో ఒకసారిగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.