అసిఫాబాద్: ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు: సీఐ బాలాజీ వరప్రసాద్
ఆసిఫాబాద్ మండలంలోని బనార్వాడకి చెందిన చిచోల్కార్ సుధాకర్ (66) అనే వ్యక్తి ఈనెల 2న అదృశ్యమైనట్లు ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఆసిఫాబాద్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఇంట్లో TVS ఎక్సెల్ ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం ASF పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ఆసిఫాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని సిఐ తెలిపారు.