శ్రీకాకుళం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి:MLA గొండు శంకర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి సూర్య మహల్ జంక్షన్ వరకు స్వచ్ఛ ఉత్సవ్ ర్యాలీ లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించాలని తద్వారా శ్రీకాకుళం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుదాం అని అన్నారు. రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.