రాజవొమ్మంగిలో డ్రగ్స్ వద్దు బ్రో పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఈగల్ టీం సీఐ పీవీ సూర్య మోహనరావు
సోమవారం రాజవొమ్మంగి జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమంను సోమవారం సాయంత్రం నిర్వాహించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం,వాటి దుష్పరిణామాలు,ఈగల్ క్లబ్స్ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ సీఐ పీ.వీ. సూర్యమోహన్ రావు,ఎస్.ఐ నరేష్ కుమార్ వారి సిబ్బంది పాల్గొని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈగల్ సి.ఐ మాట్లాడుతూ మనదేశం అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర గూర్చి వివరించారు.డ్రగ్స్ వాడకంతో వచ్చే దుష్పరిణామాల గురించి, చదువు మీద ప్రభావం, కుటుంబ సమస్యలు గూర్చి వివరించారు.