పత్తికొండ: వెల్దుర్తిలో మహిళా హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ వెల్లుడి
వెల్దుర్తిలో 14వ వార్డులో బుధవారం మహిళ ఉస్మా దారుణ హత్యకు గురైంది. స్థానికుల వివరాల మేరకు.. ఘటన వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రియుడు నిన్న మధ్యాహ్నం ఇంట్లోకి ప్రవేశించినట్లు స్థానికులు తెలపడంతో అతడే హత్య చేసుంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మృతురాల తల్లి నూర్జహాన్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.