పత్తికొండ: పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి రైతు సంఘం డిమాండ్
టమాటాకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని రైతుసంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం పత్తికొండలో రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌ను సందర్శించి టమాటా రైతుల సమస్యలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. రైతులు టమాటా మార్కెట్‌కు తీసుకువస్తే ధరలు తగ్గడంతో రవాణా ఛార్జీలు కూడా సరిపోవడంలేదన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే ధరలు లేకపోవడం అన్యాయమన్నారు.