నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తుడిచెర్ల గ్రామంలోని ఏబీఎం చర్చిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ నష్టం జరిగింది, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, 20 కుర్చీలు, టేబుల్ ఫ్యాన్లు, యాంఫీల్ ప్లేయర్లు కాలిపోయి సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం సంభవించిందని చర్చి నిర్వాహకులు తెలిపారు, గ్రామ సర్పంచ్ బాల మద్దిలేటి టిడిపి జూపాడుబంగ్లా మండల అధ్యక్షుడు కడియం పుల్లన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు, ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు వెల్లడించారు.