మనోహరాబాద్: వెంకటాపూర్ శివారులోని భూమ్ చెరువు అలుగు కాలువల ఆక్రమణలు తొలగింపు
వెంకటాపూర్ శివారులోని భూమ్ చెరువు అలుగు కాలువల ఆక్రమణలు తొలగింపు తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ పంచాయతీ పరిధి శివారులోని భూమ్ చెరువు అలుగు కాలువల అక్రమణాలను ఇరిగేషన్ అధికారులు తొలగించారు. అలుగు కాలువలు అక్రమణాలకు గురి కావడంతో వరద నీరు వ్యవసాయ భూముల్లోకి చేరుతోంది. దాంతో రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్, ఏఈ అనురాధ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం హిటాచీ ఏర్పాటు చేసి అక్రమణాలను తొలగించారు.