కొలిమిగుండ్ల మండలం బెలుంలో వీఏఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా ప్రధాని, ముఖ్యమంత్రి ప్రసంగాలను టీవీల ద్వారా రైతులకు వినిపించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా 6,197 మంది రైతులకు రూ.7,000 చొప్పున నిధులు జమ కానున్నాయి.