గంగాధర నెల్లూరు: GDనెల్లూరు మండలం ఎస్.ఎస్ కొండ గ్రామంలో సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థాన ఆవరణలో గ్రామస్థులు ధర్నా
GDనెల్లూరు మండలం ఎస్.ఎస్ కొండ గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థాన ఆవరణలో గ్రామస్థులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. స్వామి వారి దేవస్థానం భూములు కబ్జా చేశారంటూ చిత్తూరు-పుత్తూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆలయ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ధర్నాను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.