సంగారెడ్డి: పెండింగ్లోని స్కాలర్షిప్ వెంటనే చెల్లించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు USFI ధర్నా
పెండింగ్లోని స్కాలర్ షిప్స్, ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ USFI ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిఆర్వో పద్మజ రాణికి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. బకాయిలు విడుదల చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు