సూర్యాపేట: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే విషయం త్వరలోనే ముగిసిపోతుంది: మంత్రి శ్రీధర్ బాబు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి శ్రీధర్ బాబు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం త్వరలోనే ముగిసిపోతుందన్నారు. వారు ఇచ్చిన అప్పుడే వీటిలో అన్ని విషయాలు వెల్లడించారని తెలిపారు .గ్రూప్ వన్ పరీక్షల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన ప్రతిభావంతులపై కొందరు నిందారోపణలు చేయడం అన్యాయమన్నారు.