తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రజలందరికీ అడ్వాన్స్ గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ 31 రాత్రి విధించిన ఆంక్షలు తెలియజేశారు. తాడిపత్రిలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన మాట్లాడారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తీసేసి బైక్ లో డ్రైవ్ చేయడం వంటివి నిషేధించామన్నారు. రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలను జరపకూడదన్నారు. అల్లర్లు చేయకూడదన్నారు. ప్రశాంతంగా, సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని సూచించారు.