ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో పురాతన శివాలయం నందు శుక్రవారం తెల్లవారుజాము నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. కనుమ సందర్భంగా విశిష్ట తిధిని బట్టి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు కృష్ణస్వామి తెలిపారు.