జమ్మలమడుగు: బద్వేల్ : నియోజకవర్గంలో తుఫాన్ తీవ్రతకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి - వైసిపి అదనపు సమన్వయకర్త
కడప జిల్లా బద్వేల్ నియోజవర్గంలో తుఫాన్ కారణంగా వేల ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని బద్వేల్ నియోజకవర్గం వైయస్.ఆర్.సిపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన కాశినాయన మండలంలోని చిన్నాయపల్లె, కోడిగుడ్లపాడు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన ఉల్లి రైతుల పొలాల్లోకి వెళ్లి వారి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి తక్షణమే రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.