'జవాన్ మురళీనాయక్ త్యాగం దేశ ప్రజలు మరువరు: గోరంట్ల సీఐ శేఖర్
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా గ్రామాన్ని గోరంట్ల సీఐ శేఖర్, ఎస్ఐ రామచంద్ర మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. పోలీసు అమరవీరులు దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ మురళీనాయక్ సమాధి వద్ద పూలమాలలు వేసి పుష్పాంజలి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. మురళీ చేసిన త్యాగాన్ని దేశ ప్రజలు ఎప్పుడూ స్మరించుకుంటారని సీఐ తెలిపారు.