కలకడలో ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు అక్కడికక్కడే మృతి
కలకడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు బుధవారం సాయంత్రం తెలిపిన వివరాల మేరకు కేవిపల్లి మండలం తిమ్మాపురం కురవపల్లికి చెందిన పాలేటి తన ద్విచక్ర వాహనంలో కలకడలో జరిగే వారపు సంతకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కలకడ మండలం బాటవారిపల్లి పంచాయతీ పోతువారిపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టించుకోవడానికి ద్విచక్ర వాహనాన్ని సెడన్ గా మల్లించగా వెనుక నుంచి వచ్చిన లైలాండ్ టమోటా వాహనం ద్విచక్ర వాహనం ను బలంగా ఢీకొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.కలకడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించి కేసు నమోదు చేశారు