కొత్తగూడెం: పిడుగుపాటు వల్ల మరణించిన మేకల యజమానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి:సిపిఎం
సుజాతనగర్ మండలంలోని జామాయిల్ తోట వద్ద స్థానిక సిపిఎం నాయకుడైన కేసు పాక శ్రీనుకు చెందిన పదిహేను మేకలు పిడుగుపాటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మధ్యాహ్నం నాలుగు గంటలకు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి మేకలు ఆధారమని ఆ మేకలు పిడుగుపాటు వల్ల చనిపోయాయని ఈ నేపథ్యంలో శ్రీను కుటుంబాన్నీ ప్రభుత్వమే ఆదుకోవాలని, ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.