కోడుమూరు: కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో గూడూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు
కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో గూడూరు పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. మృతులు చంద్రశేఖర్, నవీన్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సుమన్ అనే యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ముగ్గురిది దాదాపు ఒకే వయసు. గూడూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.