రాయదుర్గం: పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి 70 వేలు విలువైన పరికరాలు వితరణ చేసిన దాతలు
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రూ. 70 వేలు విలువైన పరికరాలు క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ సంస్థ ద్వారా వితరణ చేశారు. సోమవారం ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్, ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, కొండాపురం శ్రీనివాసులు, జయంతి సురేష్ కు ఆ సంస్థ ఏరియా మేనేజర్ గంగాధర్, బ్రాంచ్ మేనేజర్ రామచంద్ర, అసిస్టెంట్ మేనేజర్ నాగ మహేష్ లు ఈ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్, ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా పేదలకు ఉపయోగపడేలా పరికరాలు ఇవ్వడం అభినందనీయమన్నారు.