యాడికి మండలంలో ఆదివారం వైసీపీ మండల కన్వీనర్ సంజీవ రాయుడు ఆధ్వర్యంలో సర్పంచుల సమక్షంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. యాడికి మండల కేంద్రంతో పాటు గుడిపాడు, నిట్టూరు, కోన్ ఉప్పలపాడు గ్రామాల్లో కోటి సంతకాలు కార్యక్రమాలను నిర్వహించారు. మెడికల్ కళాశాలలో ప్రైవేటుపరం చేసే కుట్రను అడ్డుకునే క్రమంలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కోటి సంతకాలు పూర్తయ్యాక నివేదికను రాష్ట్ర గవర్నర్ కి అందజేయనున్నట్లు వైసీపీ నాయకులు చెప్పారు.