నంద్యాల పట్టణంలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యయత్నం చేయడం మంగళవారం తీవ్ర కలకలం రేపింది. అయేషా అనే మహిళ తన అత్త ఆడపడుచులు వేధిస్తున్నారని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని తన సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆ మహిళను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు