అమీర్పేట: విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి: 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ నాయకులు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం మధ్యాహ్నం 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. అలాగే ప్రభుత్వం జీవో నెంబర్ 21ని రద్దు చేసి విశ్వవిద్యాలయ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మూడు శాతంతో కూడిన ఇంక్రిమెంట్ స్కేల్ అమలు చేయాలని అన్నారు.