యువతలో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించాలి : నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం
Anantapur Urban, Anantapur | Sep 29, 2025
యువతలో ఆధ్యాత్మికత భావన ను పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. నగరంలోని కోర్టు రోడ్డు లో భక్తాంజనేయ స్వామి ఆలయంలో భాగవత్ పారాయణం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం అతిథిగా హాజరయ్యారు. ఆధ్యాత్మికత భావనలను పెద్ద ఎత్తున పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.