ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో మద్యం షాపు వద్ద శనివారం అతిగా మద్యం తాగి మృతి చెందిన వ్యక్తి వివరాలను మీడియాకు ఎస్సై రవీంద్రారెడ్డి రాత్రి తెలిపారు. మృతుడు బేస్తవారిపేట మండలం పాత మల్లాపురం గ్రామానికి చెందిన అంకయ్యగా గుర్తించామని ఎస్సై రవీంద్రారెడ్డి వెల్లడించారు. మృతుడు అత్యధికంగా మందు తాగడం వల్ల మృతి చెందాడని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ అన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.