జనగాం: పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను,స్మశాన వాటికను సందర్శించి పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ పట్టణంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను,పట్టణంలోని నెహ్రూ పార్కు సమీపంలోని స్మశాన వాటికను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం సందర్శించి పరిశీలించారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,స్మశాన వాటికలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే పట్టణంలోని అర్బన్ పార్క్ లను కూడా పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.