గుంతకల్లు: గుత్తి మండలం రజాపురం గ్రామంలో అనారోగ్య సమస్యలతో యువతి ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రికి తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రజాపురం గ్రామంలో రాజేశ్వరి అనే యువతి అనారోగ్యసమస్యలతో గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాజేశ్వరి గత కొన్ని నెలలుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతుండేది. పలు ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్నా తలనొప్పి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో విషద్రావకం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.